Leh protest : లద్దాఖ్‌లో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన చేసింది. నేపాల్ జెన్ జెడ్ తరహాలో లద్దాఖ్‌లోని లేహ్‌లో అల్లర్లకు కారణం సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) అని తెలిపింది. ఆయన ప్రకటనలతో లేహ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగాయని హోం శాఖ పేర్కొంది. సాయంత్రం వరకూ పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ప్రజలకు, యువత సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులను ప్రచారం చేయొద్దు. లద్దాఖ్ ప్రజల కాంక్షలు తీర్చేందుకు కేంద్రం సిద్దంగా ఉంది. అలానే రాజ్యాంగపరమైన పరిరిక్షణలు కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది అని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని బుధవారం జెన్ జెడ్ ఆందోళనలు చేపట్టింది. లదాఖ్ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు మేరకు వేలాది మంది యువత నిరసన కార్యక్రమాల్లో పాల్గొంది. పోలీసులు వాళ్లను అదుపు చేయాలని చూడగా.. రెచ్చిపోయిన ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నిప్పు పెట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా 60 మందికిపైగా గాయపడ్డారు. దాంతో.. కేంద్ర హోం శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.