న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) పేరు సేవా తీర్థ్గా మారనుంది. పౌరుల ముంగిటకు పాలన నినాదానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంతవరకు సౌత్ బ్లాక్‌లో పీఎంవో ఉండగా, ప్రధాని అక్కడి నుంచి విధులు నిర్వహిస్తున్నారు.
అయితే పీఎంవో కొత్త కార్యాలయంలోకి మారనుంది. గతంలో సెంట్రల్ విస్టా డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ అని పిలిచే వారు. మరోవైపు గవర్నర్ల అధికార నివాసాలైన రాజ్భవన్లను కూడా కేంద్రం లోక్ భవన్‌గా మారుస్తున్నది. ఇప్పటికే కొన్ని రాష్ర్టాలలో రాజ్‌భవన్ పేర్లను మార్చారు.