Kiren Rijiju | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పలు అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చలకు ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, సభ సజావుగు జరిగేలా చూడాలని ప్రభుత్వం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. సమావేశంలో ఆయా అంశాలపై నిర్మాణాత్మక చర్చకు హామీ ఇచ్చింది. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ తామ విశాల హృదయంతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూల్స్, సంప్రదాయం మేరకు పని చేస్తామని. వీటిని చాలా విలువైనవిగా భావిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.
కేంద్రం పార్లమెంట్లో తగిన విధంగా స్పందిస్తుందన్నారు. అయితే, ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశంపై మీడియా ఆయనను ప్రశ్నించగా.. పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాలిపోయిన రూ.500 నోట్ల కట్టలు దొరికిన తర్వాత అభిశంసనను ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుపై స్పందిస్తూ.. ఆయనను తొలగించేందుకు ఇప్పటికే వంద మంది ఎంపీలు సంతకాలు చేశారన్నారు. జస్టిస్ వర్మ కేసులో ఈ ప్రక్రియను అన్ని పార్టీలు కలిసి చేపడుతాయని.. ఇది ఒక్క ప్రభుత్వం చర్య కాదన్నారు. ఆపరేషన్ సిందూర్, బీహార్ ఓటర్ల జాబితా సవరణ అంశం, విదేశాంగ విధానం అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతాయని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి.
#WATCH | After the all-party meeting, Parliamentary Affairs Minister Kiren Rijiju says, “There are several issues on which the parties have opined that they should be discussed in the Parliament. We are ready for discussions with an open heart. We work as per rules and tradition… pic.twitter.com/zmJHgMjzRl
— ANI (@ANI) July 20, 2025