న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తన అధికారుల కోసం త్వరలో ‘సోషల్ మీడియా ప్రవర్తనా నియమావళి’ తీసుకువచ్చే అవకాశం ఉంది. విధుల్లో ఉన్న సమయంలో కొందరు అధికారులు వ్యక్తిగత రీల్స్, వీడియోలు, స్టోరీలు, అభిప్రాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా తొలిసారిగా చర్యలు చేపట్టనుంది. అధికారుల కోసం సోషల్ మీడియా కోడ్ తీసుకువచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ప్రధాని మోదీ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ దేశంలోని పౌరులకు ఏకీకృత సేవలందించే వేదికగా ‘ఏక్ భారత్’ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ను కూడా కోరారు. దీంతో ఏక్ భారత్ పోర్టల్ అవసరం ఏర్పడింది. ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారుకు ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రమే అవసరమవుతుంది.