శ్రీనగర్ : ఓ ఇండిగో విమానం అనుకోకుండా మెటల్ పోల్‌ను ఢీకొట్టింది. నవీ ముంబై నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 9గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఇండిగో 6ఈ 225 అనే ఫ్లైట్ ల్యాండ్ అయింది. పార్కింగ్ చేస్తుండగా అనుకోకుండా పోల్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఫ్లైట్ ముందు భాగం దెబ్బతిన్నది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమా దం సంభవించలేదు. ఘటనపై విచారణ జరుపుతామని, విమానంలో ఏమైనా టెక్నికల్ సమస్యలున్నాయో తెలుసుకుంటామని ఇండిగో సంస్థ తెలిపింది.