ముంబై : భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న మధుమేహ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శుక్రవారం డిజిటల్ పోర్టల్‌తో పాటు ‘విశ్వాస్’ వీడియో సిరీస్‌ను ప్రారంభించారు. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఇండియా(ఆర్ఎస్ఎస్డీఐ), ఐఐటీ బాంబే కలిసి రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ గ్రామానికి వైద్య పరీక్షలు, చికిత్స, రోగులకు అవగాహనను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, డిజిటల్ సాధనాల సాయంతో మధుమేహాన్ని ముందుగానే గుర్తించవచ్చన్నారు. ‘విశ్వాస్’ వీడియో సిరీస్ ద్వారా రోగులు తమ సొంత భాషలో వ్యాధిని అర్థం చేసుకుని, దాన్ని ధైర్యంగా నియంత్రించేందుకు సహాయపడుతుందన్నారు.