న్యూఢిల్లీ: కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్‌పై ఏకంగా రూ.195.5 పెంచింది. అలాగే ఐదు కిలోల చిన్న సిలిండర్‌పై రూ.51 పెంచుతున్నట్టు బుధవారం ప్రకటించింది. సవరించిన తర్వాత 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2,078, ముంబైలో 2,031కు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,320గా ఉన్నది. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని అధికారులు ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గత నెలలో కూడా గృహ వినియోగ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.155 పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు విమానం ఇంధన ధరను కూడా కేంద్రం కిలోలీటరుకు 8.5 శాతం పెంచింది. దీంతో ఏటీఎఫ్ ధర రూ.1,04,927కి చేరింది. అలాగే ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఎక్స్ట్రా గ్రీన్ డీజిల్ ధర రూ.1.50 పెరిగి రూ.92.99కి చేరింది. అలాగే ఎక్స్పీ100 పెట్రోల్ రూ.11 పెరిగి రూ.160కి చేరుకున్నది.