న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం సమాధానం చెప్పారు.
ప్రభుత్వ వ్యవహారాలకు అనుగుణంగా అవసరం మేరకు సివిల్ సర్వీసుల్లో యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి విధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు.