న్యూఢిల్లీ, మే 3: ప్రస్తుతమున్న ‘ఆధార్ కార్డ్’ ఫార్మాట్‌ను మార్చుతున్నట్టు వస్తున్న ఊహాగానాల్ని కేంద్రం కొట్టివేసింది. అలాంటి ప్రతిపాదనేదీ తమ ముందు లేదని, ఫొటోగ్రాఫ్, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డును తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘ఈ ఏడాది చివరి నాటికి ఆధార్ కార్డ్ డిజైన్‌ను కేంద్రం మార్చబోతున్నదని సోషల్‌మీడియాలో ప్రచారం, మీడియా సంస్థల నివేదికలు ప్రజల్ని అనవసరంగా గందరగోళపరుస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు వార్తలు’ అని కేంద్రం తెలిపింది. ఆధార్ కార్డ్‌పై ఆధార్ నంబర్, పేరు, అడ్రస్ సహా ఇతర వ్యక్తిగత వివరాల స్థానంలో క్యూఆర్ కోడ్‌ను తీసుకొస్తున్నట్టు వస్తున్న వార్తల్ని కేంద్రం ఖండించింది. ఆధార్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో వచ్చే పోస్ట్‌లపై ప్రజలు ఆధారపడవద్దని కోరింది.