Grok AI : సామాజిక మాధ్యమాల్లో ప్రముఖమైన ‘ఎక్స్’ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ‘గ్రోక్'(Grok) చాట్ బాట్ సృష్టిస్తున్న అసభ్యకరమైన కంటెంట్ వెంటనే తొలగించాలని కోరింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బోట్ గ్రోక్ సృష్టిస్తున్న అశ్లీల కంటెంట్‌కు అడ్డుకట్టలు వేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు 72 గంటల్లో సంస్థ తీసుకున్న చర్యల గురించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్(ATR) తమకు అందజేయాలని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎక్స్ సంస్థకు చెందిన ఏఐ చాట్‌బోట్ గ్రోక్ అనేది లైగింక పరమైన అంశాలను, మహిళల అసభ్య చిత్రాలను క్రియేట్ చేయడం, వాటిని వ్యాప్తి చేయడాన్ని తేలిక చేసిందని కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఫిర్యాదు చేశారు. గ్రోక్ పనితీరుపై అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకున్న సమాచార సాంకేతిక శాఖ ఈ చాట్‌బోట్ సమాచార సాంకేతిక చట్టం 2000ను, ఐటీ నియమాలు 2021ను పాటించడం లేదని గుర్తించారు. గ్రోక్ ఏఐను దుర్వినియోగం చేస్తున్నారని.. మహిళలు, చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకొని అశ్లీలతను వ్యాప్తి చెందించడం, అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను క్రియేట్ చేస్తున్నారని సమాచార మంత్రిత్వ శాఖ ఆగ్రహం వెలిబుచ్చింది.
❗️ Indian Govt Issues Notice to X Over ‘Obscene, Sexually Explicit’ Content on Grok
The Ministry of Electronics and Information Technology (MeitY) has directed X to immediately review its Grok AI chatbot and send an Action Taken Report within 72 hours detailing measures… pic.twitter.com/cJSJ9iQLbm
— RT_India (@RT_India_news) January 2, 2026
‘చట్టాలను ఉల్లంఘింస్తూ రూపొందించిన కంటెంట్‌ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తొలగించాలి. ఐటీ నియమావళి 2021 ప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆధారాలను ధ్వంసం చేయకూడదు. ఏఐ చాట్‌బోట్ గ్రోక్ లోపాల కారణంగా ఐటీ చట్టం సెక్టన్ 79 ప్రకారం ఎక్స్ సంస్థకు కల్పించిన సురక్షితమనే ట్యాగ్ చేజారుతుంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, పొక్సో్ చట్టం.. వంటి పలు చట్టాల కింద కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంద’న ఎక్స్ సంస్థకు కేంద్రం స్పష్టంగా చెప్పింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
ట్విట్టర్(X) కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న అసభ్యకరమైన కంటెంట్ వెంటనే తొలగించాలని, 72 గంటల్లో తీసుకున్న చర్యల గురించి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం pic.twitter.com/vXQuDKYTwR
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2026