న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కేంద్ర ప్రభుత్వ పథకాల (పీడీఎస్, పీఎం పోషణ్) కింద ఇకపై ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం) పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు దశల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో ఇన్నొవేషన్, వ్యాపార దృక్పథం పెంపొందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం) ను 2023 మార్చి వరకు పొడిగించింది. నిర్వహణలో లేని బొగ్గుగనులను ప్రభుత్వ రంగ సంస్థలు తిరిగి అప్పగించేందుకు వన్‌టైం విండో ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.