పవన్ హన్స్ విక్రయంలో కేంద్రం యూటర్న్!
దేశంలో హెలికాప్టర్ సేవల్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ ‘పవన్ హన్స్'. దీని వాటా విక్రయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): దేశంలో హెలికాప్టర్ సేవల్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వరంగ సంస్థ ‘పవన్ హన్స్’. దీని వాటా విక్రయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకొన్నది. పవన్ హాన్స్ కోసం విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచిన స్టార్9మొబిలిటీలో మెజార్టీ వాటా ఉన్న అల్మాస్ గ్లోబల్ అపర్చునిటీస్ ఫండ్‌ను అనర్హత కలిగిన కంపెనీగా తేలుస్తూ.. విక్రయ ప్రక్రియకు బ్రేకులు వేసింది. రూ. 4,898 కోట్ల విలువ చేసే పవన్ హాన్స్‌ను కేవలం రూ. 211.14 కోట్లకే అల్మాస్ కంపెనీకి మోదీ సర్కారు కట్టబెట్టింది.
దీనిపై పెద్దయెత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రుణదాతలకు చెల్లింపులు చేయడంలో అల్మాస్ గ్లోబల్ విఫలమైందని ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) తేల్చింది. దీంతో గత ఏడాది మేలో విక్రయ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇంత జరిగినా..అల్మాస్పై అనర్హతవేటు పడలేదు. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయంగా నష్టం జరుగుతుందన్న భయంతో కేంద్రం వెనుకడుగు వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

