అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు
గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు సహా వేతన సంబంధిత నిబంధనలను ప్రామాణీకరించడంతోపాటు అధికారిక సామాజిక రక్షణను విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెండు ప్రధాన కార్మిక సంస్కరణలైన వేతనాల కోడ్, 2019, సామాజిక భద్రత కోడ్, 2020 కింద కీలక నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
- ఇకపై వారంలో పని గంటలు 48కి పరిమితం
- కార్మికుల కనీస వేతనాలు రోజువారీగా గణన
న్యూఢిల్లీ, మే 9: గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు సహా వేతన సంబంధిత నిబంధనలను ప్రామాణీకరించడంతోపాటు అధికారిక సామాజిక రక్షణను విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రెండు ప్రధాన కార్మిక సంస్కరణలైన వేతనాల కోడ్, 2019, సామాజిక భద్రత కోడ్, 2020 కింద కీలక నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కనీస వేతనాలు, వేతనాల చెల్లింపు, బోనస్, సమాన వేతనాలకు సబంధించిన నిబంధనలను ఒక చట్రం కిందకు తీసుకువస్తూ ప్రభుత్వం శుక్రవారం వేతనాల కోడ్(కేంద్ర) నిబంధనలు, 2026ను నోటిఫై చేసింది.
29 కేంద్ర కార్మిక చట్టాలను ఏకీకృతం చేసే లక్ష్యంతో ఉన్న నాలుగు కార్మిక కోడ్ల అమలును కేంద్రం ముందుకు తీసుకువెళుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. వేతన నిబంధనలు 8 గంటల సాధారణ పని దినాన్ని నిర్దేశిస్తాయి. వారపు పని గంటలను 48 గంటలకు పరిమితం చేస్తాయి. కనీస వేతనాలను రోజువారీ ప్రాతిపదికన లెక్కిస్తారు.
అయితే గంటవారీ వేతనాన్ని ఎనిమిదితో భాగించడం ద్వారా, నెలవారీ వేతనాలను రోజువారీ వేతనాన్ని 26తో గుణించడం ద్వారా లెక్కిస్తారు. లేబర్ బ్యూరో ప్రచురించే వినియోగదారుల ధరల సూచీ డేటా ఆధారంగా సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్ 1, అక్టోబర్ 1 తేదీలకు ముందు) వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్(వీడీఏ)ను సవరించాలని కేంద్రం ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

