YouTube | సీక్రెట్ వార్ డాక్యుమెంటరీపై యూట్యూబ్ నిషేధం.. ఎందుకంటే?
‘ఆస్ట్రేలియాలోకి చొరబాటుదారులు- ఇండియా సీక్రెట్ వార్' పేరిట ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ టీవీ రూపొందించిన ఓ డాక్యుమెంటరీ ప్రసారాన్ని భారత్లో యూట్యూబ్ నిషేధించింది.
- YouTube | హైదరాబాద్, ఆగస్టు 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘ఆస్ట్రేలియాలోకి చొరబాటుదారులు- ఇండియా సీక్రెట్ వార్’ పేరిట ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ టీవీ రూపొందించిన ఓ డాక్యుమెంటరీ ప్రసారాన్ని భారత్లో యూట్యూబ్ నిషేధించింది. కేంద్రప్రభుత్వం ఆదేశించడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియాలోని కొందరు సిక్కులను లక్ష్యంగా చేసుకొని ఇండియన్ ఇంటెలిజెన్స్కు చెందిన కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నట్టు ఈ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.
లక్షిత వర్గం ఖలిస్థానీ ఉద్యమానికి సానుకూలంగా ఉండటంతో పాటు మోదీ ప్రభుత్వాన్ని పలుమార్లు విమర్శించినట్టు వెల్లడించారు. ఈ కారణంగానే ఈ డాక్యుమెంటరీని భారత్లో నిషేధించినట్టు తెలుస్తున్నది. కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, గోద్రా అల్లర్లకు సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీని కూడా గతంలో కేంద్రం నిషేధించడం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

