ఏఐఎస్‌లను ఇవ్వండి ప్లీజ్.. డిప్యూటేషన్‌పై పంపాలని రాష్ట్రాలకు కేంద్రం వినతి
మోదీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్ (ఏఐఎస్) అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు.
- అధికారుల కొరత వల్లే
- కేంద్ర సర్వీసు మాకొద్దు
- అధికారుల స్పష్టీకరణ
- నిబంధనలు మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్నబీజేపీయేతర రాష్ర్టాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: మోదీ సర్కారు తీరుతో కేంద్ర సర్వీసులంటేనే అఖిల భారత సర్వీస్ (ఏఐఎస్) అధికారులు ఇష్టపడటం లేదు. ఆ వైపు కూడా చూడటం లేదు. దీంతో వారిని డిప్యూటేషన్‌పై ఢిల్లీకి పంపాలని కేంద్రం రాష్ర్టాలను విన్నవిస్తున్నది. కారణం.. కేంద్రంలో సరిపడా ఏఐఎస్‌లు లేకపోవటమే. అఖిల భారత సర్వీసుల్లో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆఫ్ స్టేట్స్/యూటీస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చొరవ తీసుకోవాలని విన్నవించారు. వాస్తవానికి కేంద్ర సర్వీసుల్లో పనిచేయాలనేది చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కోరిక. కానీ, కేంద్ర పెద్దల ఒత్తిడి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వల్ల ఆ దిక్కే చూడటం లేదు. గత ఐదేండ్లలో 563 మందికి డిప్యూటేషన్ అవకాశం వచ్చినా, 397 మందే ఆసక్తి చూపారు.
నిబంధనల మార్పులకు కేంద్రం ప్రయత్నాలు
కేంద్రంలో డిప్యూటేషన్‌పై వెళ్లే ఏఐఎస్ అధికారుల సంఖ్య బాగా తగ్గిపోవటంతో సర్వీస్ నిబంధనల్లో మార్పులు చేయాలని కేంద్రం చూస్తున్నది. ఇప్పటి వరకు కేంద్రం, రాష్ర్టాల ఉమ్మడి అంగీకారం మేరకు అధికారిని డిప్యూటేషన్‌పై పంపేవారు. కొత్త ప్రతిపాదన వస్తే రాష్ర్టాల అభిప్రాయంతో సంబంధం ఉండదు. కేంద్రం ఎవరిని పంపాలంటే వారిని పంపాల్సిందే. అందుకే బీజేపీయేతర రాష్ర్టాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

