Census 2027 | కొత్త ఏడాది 2027 జనాభా గణన ప్రారంభం కాబోతున్నది. ఎన్యుమరేటర్లు ఇండ్లకు చేరుకొని సమాచారం సేకరించారు. సర్వేయర్లంతా మీ ఇంటి నిర్మాణం నుంచి దాని ఉపయోగం వరకు ప్రతిదాని సమాచారం సేకరించనున్నదారు. ఉదాహరణకు సౌరశక్తి నుంచి ఇంటర్నెట్ వినియోగం వరకు ప్రతిదానిపై సమాచారాన్ని కోరనున్నారు. ఇంటి నేల, పైకప్పు, గోడలు దేనితో తయారు చేస్తారు? ఇల్లు నివాసంగా ఉపయోగిస్తున్నారా? కార్యాలయమా..? గెస్ట్హౌసా? ప్రార్థన స్థలం కూడా ఉందా?.. కాలువ, నది, బావి, చేతిపంపు, నల్లాల ద్వారా నీరు అందుతుందా? ప్యాకేజ్డ్, సీసాల్లో నీటిని ఉపయోగిస్తారా? అనే సమాచారాన్ని సేకరించనున్నారు. అలాగే, టెలిఫోన్లు, స్మార్ట్ఫోన్ల గురించిన సమాచారం కూడా సేకరించనున్నారు. దీని ఉద్దేశం కేవలం దేశ ప్రజల జీవన ప్రమాణాలు అర్థం చేసుకోవడమే. డేటా అభివృద్ధి చెందిన భారత ప్రచారంలో కొత్త విధానాలను రూపొందించడంలో, ఇప్పటికే ఉన్న విధానాల్లోని లోపాలను సరిదిద్దడంలో సహాయపడనున్నది.
2027 జనాభా లెక్కల మొదటి దశ కోసం గృహాల జాబితా, గృహాల గణన షెడ్యూల్ జాబితాను తయారు చేసే ప్రచారాన్ని కేంద్రం ముమ్మరం చేసింది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరుగనుండగా.. ఇందు కోసం 30కిపైగా ప్రశ్నల జాబితా సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో జారీ చేయనున్నారు. ఇంటి యజమాని నుంచి ఇంట్లో ఉన్న కారు, మోటార్ సైకిల్, సైకిల్, మోపెడ్ గురించిన సమాచారం సేకరిస్తారు. ఇంట్లో వంట చేయడానికి ఏమి ఉపయోగిస్తున్నారు? కలప, పంట వ్యర్థాలు, పిడకలు, బొగ్గు, గోబర్ గ్యాస్, కిరసనాయిల్, ఎల్పీజీ, పీఎన్జీ, సోలార్ ఎనర్జీ ఇలా ఏం వాడుతున్నారో తెలుసుకొని రికార్డు చేయనున్నారు. టీవీ, ల్యాప్‌టాప్, ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లలో డిష్, డీటీహెచ్ వినియోగిస్తున్నా ఆ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే గోధుమ, జొన్న, బియ్యం, మిల్లెట్, మొక్కజొన్న వాడకం గురించి కూడా ప్రశ్నలు ఉంటాయి.
2027 జనాభా లెక్కల మొదటి దశ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఇళ్ల వివరాలు, అందులో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోనున్నారు. ప్రస్తుతం, లడఖ్, పశ్చిమ బెంగాల్ మినహా దేశవ్యాప్తంగా తొలిదశ సర్వే కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి డేటాను సేకరించి ఆన్లైన్లో అప్డేట్ చేయనున్నారు. తొలిసారిగా డిజిటలైట్ చేస్తుండడం వల్ల జనాభా గణణ డేటా త్వరలోనే అందుబాటులోకి రానున్నది. గతంలో జనాభా గణన వివరాలు వేగంగా అందుబాటులోకి వచ్చినా.. వివరణాత్మక డేటా వచ్చేందుకు చాలా సంవత్సరాలు పట్టేది. రెండో దశలో 2027లో దేశవ్యాప్తంగా జనాభా గణన ఉంటుంది. ఇందులో కుల గణన కూడా ఉంటుంది. స్వాతంత్య్రం తర్వాత జనాభా గణణలో మొబైల్ యాప్స్, పోర్టల్స్‌ను ఉపయోగిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఉంటాయి. రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ ఆఫీస్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు వివరణాత్మక సూచనలను పంపింది.