న్యూఢిల్లీ: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రసారమయ్యే కంటెంట్‌పై నియంత్రణ తీసుకువచ్చే దిశగా కేంద్రం యోచిస్తోంది. ఇంతవరకూ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకే పరిమితమైన సెన్సార్ బోర్టు నిబంధనలు ఇకపై ఓటీటీ కంటెంట్‌కు కూడా వర్తించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సమాచార సాంకేతిక నిబంధనలను సవరించే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇటీవల దిల్జిత్ దోసాంజ్ నటించిన ‘సత్లుజ్’ సినిమాను సెన్సార్ సర్టిఫికేషన్ లేకుండా ప్రముఖ ఓటీటీ వేదికలో విడుదల చేశారు. ఈ సినిమాకు 127 సెన్సార్ కట్స్ ఉన్న దరిమిలా ప్రభుత్వం ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగింపజేసింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ అవసరమనే అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కంటెంట్ విషయంలో స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి.