Celebs At Ayodhya | అయోధ్యకు చేరుకుంటున్న సెలబ్రెటీలు.. హనుమాన్ ఆలయంలో అనుపమ్‌ఖేర్ ప్రత్యేక పూజలు
అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కన్నులపండువగా జరుగనుంది.
ముంబై: అయోధ్య (Ayodhya) రామ మందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కన్నులపండువగా జరుగనుంది. మధ్యాహ్నం 12.05 నుంచి ఒంటి గంట ప్రధాని మోదీ చేతుల మీదుగా రామయ్య కొలువుదీరనున్నాడు. ప్రాణప్రతిష్ఠ వేడుకకు 7వేల మంది ప్రముఖులను అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు అందించింది. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు రామజన్మభూమికి (Celebrities) క్యూకడుతున్నారు.
సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయం నుంచి సచిన్ టెండుల్కర్, బాలీవుడ్ స్టార్లు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, మాధురి దీక్షిత్ దంపతులు, రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, జాకి ష్రాఫ్, రణ్‌దీప్ హుడా-లిన్ లైశర్మ దంపతులు, రణ్‌దీప్ హుడా అయోధ్యకు బయల్దేరారు. ఇక హైదరాబాద్‌లోని బేగంపే విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి, రామ్‌చరణ్ రామజన్మభూమికి వెళ్లారు.
ఇక బాలీవుడ్ నటులు కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, సూపర్‌స్టార్ రజనీ కాంత్, దనుష్ ఆదివారమే అయోధ్యకు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున అయోధ్యలోని హనుమాన్ గర్హీ ఆలయంలో అనుపమ్ ఖేర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగింది. అనంతరం ఆయన మాట్టాడుతూ రామ మందిరానికి వెళ్లేకంటే ముందు హనుమంతున్ని దర్శించుకోవడం ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం అయోధ్య మోత్తం భక్తిపారవశ్యంలో మునిపోయిందన్నారు. ప్రతిచోట జై శ్రీరామ్ నినాదమే వినిపిస్తున్నదని తెలిపారు. దీపావళి మరోసారి వచ్చిందని, ఇదే అలసైన దీపావళి అన్నారు.
#WATCH | Mumbai: Superstar Amitabh Bachchan leaves for Ayodhya.
Pran Pratishtha ceremony of Ayodhya’s Ram Temple will take place today. pic.twitter.com/pOecsD92XQ
— ANI (@ANI) January 22, 2024
#WATCH मुंबई: अभिनेता जैकी श्रॉफ श्री राम मंदिर प्राण प्रतिष्ठा समारोह के लिए अयोध्या रवाना हुए। pic.twitter.com/xngxbINQAi
— ANI_HindiNews (@AHindinews) January 22, 2024
#WATCH | Mumbai: Actor Ayushmann Khurrana leaves for Ayodhya.
Pran Pratishtha ceremony of Ayodhya’s Ram Temple will take place today. pic.twitter.com/52eLzqzoTS
— ANI (@ANI) January 22, 2024
#WATCH | Mumbai: Actor Madhuri Dixit along with her husband Dr Sriram Madhav Nene leaves for Ayodhya.
Pran Pratishtha ceremony of Ayodhya’s Ram Temple will take place today. pic.twitter.com/SlZGpQfUQP
— ANI (@ANI) January 22, 2024
#WATCH | Telangana | Actor Chiranjeevi leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today.
He says, “That is really great. Overwhelming. We feel it’s a rare opportunity. I feel Lord Hanuman who is my deity, has… pic.twitter.com/FjKoA7BBkQ
— ANI (@ANI) January 22, 2024
#WATCH | Telangana | Actor Ram Charan leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today.
He says, “It’s a long wait, we are all very honoured to be there.” pic.twitter.com/6F4oBZylS8
— ANI (@ANI) January 22, 2024
#WATCH | Ayodhya | Actor Anupam Kher says, “Before going to Lord Ram, it is very important to have the darshan of Lord Hanuman…The atmosphere in Ayodhya is so graceful. There is slogan of Jai Sri Ram in the air everywhere…Diwali has come again, this is the real Diwali.” pic.twitter.com/GCskErgi1Z
— ANI (@ANI) January 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

