ఏసీ పేలి సీసీఐ తొలి చైర్మన్.. ధనేంద్రకుమార్ మృతి!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మొదటి చీఫ్ ధనేంద్ర కుమార్ బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఊపిరాడక చనిపోయారు.
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మొదటి చీఫ్ ధనేంద్ర కుమార్ బుధవారం అర్ధరాత్రి తన ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఊపిరాడక చనిపోయారు. ఎయిర్ కండీషనర్ పేలి పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ధనేంద్ర కుమార్ ఎయిమ్స్ ట్రామా సెంటర్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది కుమార్ ఇంటికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
కుమార్ కొడుకుకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వేసవిలో ఎయిర్ కండీషనర్ల వినియోగం ఎక్కువగా ఉన్న వేళ ఈ తరహా ప్రమాదం జరగడం విద్యుత్తు వ్యవస్థ భద్రత, విద్యుత్తు ఉపకరణాల నిర్వహణపై మరోసారి ఆందోళనను రేకెత్తించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

