న్యూఢిల్లీ: రెగ్యులర్ పాఠశాలకు హాజరుకాని సీబీఎస్ఈ విద్యార్థులను 12వ తరగతి బోర్డు పరీక్షల్లో హాజరయ్యేందుకు అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. డమ్మీ స్కూళ్లలో చేరినందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
డమ్మీ స్కూళ్లపై ఉక్కుపాదం మోపుతున్న సీబీఎస్ఈ పరీక్షల బైలాస్‌ను సవరించే విషయాన్ని పరిశీలిస్తోంది. ప్రతిపాదిత మార్పుల కింద డమ్మీ స్కూళ్ల విద్యార్థులను 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించరు. వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్ఐఓఎస్) పరీక్షను రాయవచ్చు.