 
                                                            న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే ఏడాది జరిగే పదో తరగతి, పన్నెండో తరగతి వార్షిక పరీక్షల తుది షెడ్యూలును విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 17 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. పదో తరగతి బోర్డ్ పరీక్షలు 2026 మార్చి 10న ముగుస్తాయి. పన్నెండో తరగతి బోర్డ్ పరీక్షలు 2026 ఏప్రిల్ 9న ముగుస్తాయి.
కొన్ని నెలల నుంచి కొనసాగుతున్న అనిశ్చితికి ఈ ప్రకటనతో తెర పడింది. విద్యార్థులు ఇక తమ దృష్టిని పరీక్షల కోసం తయారవడంపైనే పెట్టవచ్చు. పరీక్షల షెడ్యూలును cbse.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల స్లాట్లోనే జరుగుతాయి.
 
                            