న్యూఢిల్లీ : లంచం, హార్స్‌ట్రేడింగ్ కేసులకు సంబంధించి ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్‌కు సీబీఐ శుక్రవారం సమన్లు జారీచేసింది. కొద్ది రోజుల క్రితం కారు ప్రమాదంలో గాయపడ్డ ఆయన, డెహ్రడూన్‌లోని జాలీ గ్రాంట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
దవాఖానకు వచ్చి సీబీఐ తనకు సమన్లు అందజేయటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హార్స్ ట్రేడింగ్ కేసులో హరీశ్ రావత్‌తోపాటు మాజీ కేంద్రమంత్రి హారక్ సింగ్ రావత్, సమాచార్ ప్లస్ న్యూస్ ఛానల్ ఉమేశ్ కుమార్‌లను సీబీఐ నిందితులుగా చేర్చింది.