న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసులో సీబీఐ అధికారులు శనివారం ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆఫీసులో మరోసారి సోదాలు చేశారు. గతంలో జరిగిన సోదాలతోపాటు తాజా సోదాల్లోనూ తనకు వ్యతిరేకంగా సీబీఐకి ఎలాంటి ఆధారాలు లభించలేదని సిసోడియా తెలిపారు. ‘సీబీఐ అధికారులకు గత సోదాల్లో వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. తాజా సోదాల్లోనూ వారికి ఏమీ లభించవు’ అని ఆయన ట్వీట్ చేశారు.