న్యూఢిల్లీ: కాక్స్ అండ్ కింగ్స్(Cox and Kings) ట్రావెల్ కంపెనీపై సీబీఐ ఫ్రాడ్ కేసు నమోదు చేసింది. ఆ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లపై కేసు బుక్ చేశారు. యెస్ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. కాక్స్ అండ్ కింగ్స్ కంపెనీ సుమారు 525 కోట్ల బ్యాంకు రుణం తీసుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ముంబై పోలీసుల నుంచి సీబీఐ దర్యాప్తును టేకోవర్ చేసింది. ట్రావెల్ కంపెనీకి చెందిన అజయ్ అజిత్ పీటర్ కేర్కర్, ఉషా కేర్కర్, సీఎఫ్‌వో అనిల్ ఖందేల్వాలా, మహాలింగ నారాయణ, పెసీ పటేల్‌పై కేసు బుక్ చేశారు. చీటింగ్, ఫోర్జరీ, నేర ప్రవర్తన ఆరోపణలపై కేసు నమోదు చేశౄరు. యెస్ బ్యాంకు నుంచి క్రెడిట్ పొందేందుకు తప్పుడు రికార్డులను కంపెనీ సమర్పించినట్లు కాక్స్ అండ్ కింగ్స్‌పై కేసు ఉన్నది.