న్యూఢిల్లీ: ఓ బ్యాంకు ఫ్రాడ్ కేసు(Bank Fraud Case)లో.. సీబీఐ తీరును ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ విద్యుత్తు పరికరాల ఉత్పత్తి సంస్థ సుమారు 12 బ్యాంకుల నుంచి దాదాపు 2435 కోట్ల రుణం తీసుకున్నది. అయితే ఆ కంపెనీ తిరిగి డబ్బులు చెల్లించడంలేదు. దీంతో ఆ కంపెనీ మాజీ ప్రమోటర్ గౌతమ్ థాపర్‌పై కేసు బుక్ చేశారు. సీజీ పవర్ కంపెనీ మోసాలకు పాల్పడినట్లు ఎస్బీఐ బ్యాంకు కేసు పెట్టింది. అయితే ఆ కేసును సీబీఐ విచారించింది.
సీబీఐ ఇచ్చిన రిపోర్టుపై.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థ విచారణకు చెందిన పూర్తి సమాచారాన్ని ఇవ్వడం లేదని కోర్టు పేర్కొన్నది. నిజం ఎప్పటికీ బయటకు రావొద్దు అని సీబీఐ భావిస్తున్నట్లు కోర్టు ఆరోపించింది. రౌజ్ అవెన్యూ కోర్టుకు చెందిన స్పెషల్ జడ్జి సంజీవ్ అగర్వాల్ ఈ కేసులో ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 21వ తేదీన జరిగే విచారణ సమయంలో.. కేసుకు చెందిన క్రైం ఫైల్స్ అన్నీ తీసుకురావాలని కోర్టు ఆదేశించింది.