కారు ఆపి.. కాల్చి చంపారు

- రాజస్థాన్‌లో దారుణం
- డాక్టర్ దంపతుల కాల్చివేత
భరత్పూర్, మే 29: కారులో వెళుతున్న డాక్టర్ దంపతులను ఇద్దరు యువకులు బైక్‌పై వెంబడించారు. ఓ చౌరస్తా వద్ద కారును ఓవర్టేక్ చేశారు. బైక్‌ను రోడ్డుపై అడ్డంగా నిలుపడంతో ఆ కారు కూడా ఆగింది. ఆ యువకులు నడిచి కారు వద్దకు వెళ్లారు. కారులోని వైద్యుడు కిటికీ అద్దం దింపాడు. ఇద్దరిలో ఓ యువకుడు వైద్య దంపతులపై కాల్పులు జరిపాడు. వెంటనే బైక్‌పై పరారయ్యారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు జరిగిన ఈ జంటహత్యల ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హత్య యావత్తూ సీసీటీవీల్లో రికార్డు అయింది. పాత కక్షలతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసుల విచారణలో తేలింది. రెండేండ్ల కిందట జరిగిన ఓ యువతి హత్య కేసులో డాక్టర్ దంపతుల ప్రమేయముంది. ఆ యువతికి వైద్యుడితో వివాహేతర సంబంధం ఉంది. ఆ నేపథ్యంలోనే ఆమె హత్య జరిగింది. దీంతో ప్రస్తుతం ఆ యువతి సోదరుడే డాక్టర్ దంపతులను కాల్చి చంపాడని పోలీసులు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

