Stuntman | పంజాబ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ చక్రాల కింద నలిగి స్టంట్‌మ్యాన్ (Stuntman) ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
గురుదాస్‌పుర్ జిల్లాలో ఇటీవలే గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తాతే గ్రామానికి చెందిన సుఖ్‌మన్‌దీప్ సింగ్ (Sukhmandeep Singh) అనే 29 ఏళ్ల స్టంట్‌మ్యాన్ పాల్గొన్నాడు. అక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేసిన మైదానంలో తన ట్రాక్టర్‌తో విన్యాసాలు ప్రదర్శించాడు. ట్రాక్టర్ ముందు చక్రాలను గాల్లోకి లేపి కిందకి దిగాడు. కాసేపటి తర్వాత ట్రాక్టర్ మైదానంలో చుట్టూ తిరుగుతుండగా.. సుఖ్మన్ ట్రాక్టర్ వెనుక టైర్‌పై కాలు పెట్టి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి ట్రాక్టర్ వెనుక చక్రాల కింద (tractor wheels ) పడిపోయాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సుఖ్మన్.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
A man was crushed to death after a tractor toppled during a stunt in the village Sarchur in Gurdaspur district, Punjab. Om Shanti.
Do not perform such stupid stunts. pic.twitter.com/3fISR0Wusi
— Arvind Kumar (@Arvindkumar065) October 29, 2023
Also Read..
Rahul Gandhi | అదానీని కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
Mukesh Ambani | అంబానీకి 4 రోజుల్లో మూడో బెదిరింపు మెయిల్.. ఈసారి 400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్