VarunLav | ఇటలీలో మొదలైన వరుణ్-లావణ్య పెళ్లి సందడి.. కాక్టేల్ పార్టీలో మెరిసిన చరణ్, బన్ని దంపతులు
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి (Varun Tej-Lavanya Tripathi ) మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. రేపు (నవంబర్ 1) ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్టేల్ పార్టీ (cocktail party)ని నిర్వహించారు.
Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ స్టార్స్ వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి (Varun Tej-Lavanya Tripathi ) మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. రేపు (నవంబర్ 1) ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందు కోసం అల్లు, మెగా కుటుంబాలు ఇప్పటికే ఇటలీ చేరుకున్నాయి. పెళ్లి సంబరాలను కూడా మొదలు పెట్టేశారు. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్టేల్ పార్టీ (cocktail party)ని నిర్వహించారు. ఈ పార్టీలో చిరంజీవి – సురేఖ దంపతులతోపాటు రామ్చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహా రెడ్డి తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పార్టీలో పెళ్లి కూతురు లావణ్య వైట్ డ్రెస్లో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక నేడు హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించనున్నారు. ఇక 1వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. వీరి వివాహానికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, అత్యంత సన్నిహితులు హాజరుకానున్నారు. అనంతరం నవంబర్ 5వ తేదీన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ఇక వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. చివరికి కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
All about the Last night #VarunLav ✨ cocktail party🎉@IAmVarunTej @Itslavanya
Global Star @AlwaysRamCharan
Icon StAAr @alluarjun #VarunTej #LavanyaTripathi pic.twitter.com/GYyMPXIJVH— BA Raju’s Team (@baraju_SuperHit) October 31, 2023
Also Read..
Sudha Murthy | ఆయన వారానికి 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా నిలిచిన సుధామూర్తి
Mukesh Ambani | అంబానీకి 4 రోజుల్లో మూడో బెదిరింపు మెయిల్.. ఈసారి 400 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

