Telangana | మద్యం ప్రియులే ఆదుకోవాలి!
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమలుకు ప్రభుత్వం తప్పనిసరిగా మందుప్రియులపైనే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది.
- రూ.25,617 కోట్లకు మద్యం అమ్మకాల పెంపు
- ఎక్సైజ్ నుంచి రూ.5,318 కోట్లు ‘అదనపు’ లక్ష్యం
- మరింత తాగించడం.. లేదా ధరలు పెంచడం?
- 25 శాతం మేర పెరగనున్న మద్యం వినియోగం
- ఇప్పటికే ధరలు పెంచేందుకు సర్కారు యత్నం
Telangana | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ఆదాయాన్ని అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమలుకు ప్రభుత్వం తప్పనిసరిగా మందుప్రియులపైనే ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాబడి విభాగాల్లో ఎక్సైజ్‌శాఖలోని ఒక్క మద్యం విభాగం నుంచే రూ.25,617 కోట్ల నిధులను ఆశిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం కంటే ఎక్సైజ్ నుంచి రూ.5,318 కోట్లు ‘అదనపు ఆదాయం’ రావడమే లక్ష్యంగా పెట్టుకున్నది.
25% పెరగనున్న మద్యం వినియోగం
ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే కనీసం 25 శాతం అదనంగా మద్యం అమ్మకాలు చేపట్టాల్సి ఉన్నది. దీంతో మరింత తాగించడం లేదా ధరలు పెంచటం ఒక్కడే మార్గంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఒకవై పు మద్యం ధరలు పెంచేందుకు సర్కారు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అదనపు ఆదాయం సమకూర్చుకునే క్రమంలోనే నాణ్యత తక్కువ, కల్తీ మద్యం ఆరోపణలున్న కొన్ని కంపెనీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీనిపై బీఆర్ఎస్ పోరాటం చేయటంతో అనుమతులు తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో మరో ప్రణాళికలో భాగంగా 20 – 25 శాతం మద్యం అమ్మకాలు పెంచేలా, ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా సిబ్బందికి టార్గెట్లు సైతం ఇచ్చినట్టు తెలిసింది.
సంక్షేమ పథకాల కోసం ధరల పెంపు?
సర్కారుకు వస్తున్న ఆదాయ వనరుల్లో మద్యం అమ్మకాలే ప్రధానం. మద్యం అమ్మకాలు, ట్యాక్స్‌ల ద్వారా ఏటా సుమారు రూ.35 వేల కోట్ల వరకు సరారుకు ఆదా యం సమకూరుతుంది. అయితే ఈ లక్ష్యాన్ని రూ.45 వేల కోట్లకు పెంచారు. ఎక్సైజ్‌శాఖ ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పడిన మంత్రివర్గం ఉపసంఘం నిధులు ఎలా పెంచాలనే సుదీర్ఘంగా చర్చించింది. ఒక్కో మద్యం షాపునకు రూ.50 లక్షల లక్ష్యాన్ని నిర్దేశించినట్టు కూడా సమాచారం. దీంతో మద్యం అమ్మకాలు పెంచటం అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. మద్యం, ఇతర వ్యాట్లు కలుపుకొని 2022లో రూ.32 వేల కోట్లు, 2023లో రూ.35 వేల కోట్లు ఆదాయం వచ్చింది. ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని అదనంగా రూ.10 వేల కోట్లకు పెంచి.. రూ.45 వేల కోట్లు రాబట్టాలని చూస్తున్నది. ఈ క్రమంలో 25 శాతం మద్యం ధరలు పెంచాలని కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే ధరలు పెరిగే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి.
నాడు బీఆర్ఎస్ను బద్నాం చేసిన కాంగ్రెస్!
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ క్రమ పద్ధతిలో మద్యం అమ్మకాలు చేపట్టినా.. బెల్ట్‌షాపులపై, మద్యం అమ్మకాలపై కాంగ్రెస్, నాటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గగ్గోలు పెట్టారు. అలాంటిది ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా ఎన్నడూ లేనివిధంగా రూ.45 వేల కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నాడు బీఆర్ఎస్ను విమర్శించిన వారు.. ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? అని ప్రభుత్వాన్ని విశ్లేషకులు నిలదీస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

