స్వచ్ఛ హైడ్రోజన్‌ను ఉత్పత్తిచేసే ఉత్ప్రేరకాలు
కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు జోధ్‌పూర్ ఐఐటీ పరిశోధకులు నానోకంపోజిట్ ఉత్ప్రేరక పదార్థాలను అభివృద్ధి చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 28: కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు జోధ్‌పూర్ ఐఐటీ పరిశోధకులు నానోకంపోజిట్ ఉత్ప్రేరక పదార్థాలను అభివృద్ధి చేశారు. పేటెంట్ హక్కులు పొందిన ఈ పద్ధతిలో వీరు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా మార్చేందుకు సహజ సూర్యకాంతిని ఉపయోగించారు. ఈ ప్రక్రియను కృత్రిమ కిరణజన్య సంయోగ క్రియగా పిలుస్తారని, ప్రకృతి సిద్ధంగా మొక్కల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ ఇలాగే జరుగుతుందని ఐఐటీ జోధ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ రాకేశ్ కే శర్మ తెలిపారు. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించేందుకు మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకొంటాయని, ఆ తర్వాత కార్బన్‌డయాక్సైడ్‌తో చర్య జరిపి కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటాయని వివరించారు. తాము రూపొందించిన ఉత్ప్రేరకం కూడా కృత్రిమ పద్ధతిలో ఇదేవిధంగా హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. కృత్రిమ పరిస్థితుల్లో సమర్థంగా హైడ్రోజన్‌ను తయారు చేయగలిగే పలు ఉత్ప్రేరకాలను జోధ్‌పూర్ ఐఐటీ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసిందని, పరిశ్రమలు, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాలకు ఇవి ఎంతో ఉపకరిస్తాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Catalysts
- oxygen
- pure hydrogen
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

