జంతువుల వీడియోలు ఆన్లైన్లో ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. ఏనుగులు, కుక్కలు, పిల్లుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి హృదయాలను హత్తుకుంటాయి. కాగా, ఓ గుర్రం, పిల్లి స్నేహంగా ఉన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వాటి స్నేహానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఈ వీడియోను ‘బిటెంగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో గుర్రం, పిల్లి స్నేహంగా కనిపించాయి. పిల్లి గోడపైనుంచి మెళ్లగా నడుచుకుంటూ వచ్చి గుర్రం తలను దాని తలతో నిమురుతుంది. పిల్లి అలా చేస్తుంటే గుర్రం ప్రేమగా చూస్తుండిపోతుంది. రెండూ ఆరాధనీయమైన క్షణాన్ని పంచుకుంటాయి. ‘కడిల్ టైమ్’ అనే క్యాప్షన్‌తో షేర్ అయిన ఈ వీడియోకు 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పదివేల కంటే ఎక్కువ మంది రీట్వీట్ చేశారు.
Cuddle time.. 😊 pic.twitter.com/q465arEy5T
— Buitengebieden (@buitengebieden) June 19, 2022