Bihar Caste Survey: ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో 42 శాతం మంది పేదలే : బీహార్ రిపోర్టు
Bihar Caste Survey: బీహార్‌లో కుల గణనకు చెందిన రిపోర్టును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల్లో 42 శాతం మంది కటిక పేదలే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. ఇక వెనుకబడిన, ఈడబ్ల్యూసీ కేటగిరీలకు చెందిన వారిలో 33 శాతం మంది ప్రజలు పేదలుగా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: బీహార్‌లో కుల గణన(Bihar Caste Survey)కు చెందిన రిపోర్టును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల్లో 42 శాతం మంది కటిక పేదలే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. ఇక వెనుకబడిన, ఈడబ్ల్యూసీ కేటగిరీలకు చెందిన వారిలో 33 శాతం మంది ప్రజలు పేదలుగా ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. జనరల్ క్యాటగిరీకి చెందిన 25.09 శాతం కుటుంబాలు పేదరికం జాబితాలో ఉన్నట్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదిక ద్వారా వెల్లడైంది.
సర్వే చేపట్టిన డేటా ప్రకారం.. ఎస్సీల్లో కేవలం ఆరు శాతం మంది మాత్రమే తమ స్కూల్ చదువులు పూర్తి చేశారు. 11వ, 12వ తరగతి వరకు చదివిన వారిలో 9 శాతం మంది ఉన్నారు. బీహార్‌లో ఉన్న జనాభాలో 60 శాతం మంది ప్రజలు వెనుకబడిన తరగతులు లేక ఈడబ్ల్యూసీ వర్గానికి చెందిన వారే ఉన్నట్లు రిపోర్టులో స్పష్టం చేశారు.
రాష్ట్రానికి చెందిన వారు సుమారు 50 లక్షల మంది బీహార్ బయట జీవిస్తున్నట్లు రిపోర్టులో తెలిపారు. ఉద్యోగం, విద్య కోసం వాళ్లు ఇతర రాష్ట్రాల్లో జీవిస్తున్నారు. బీహార్ రాష్ట్రవ్యాప్తంగా 34.1 శాతం పేదలు ఉన్నట్లు రిపోర్టులో తేల్చారు. ఆ పేదల ఆదాయం నెలకు ఆరువేల కన్నా తక్కువగా ఉంది. రాష్ట్రంలో 29 శాతం మంది పది వేల కన్నా తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 10 వేల నుంచి 50 వేల మధ్య ఆదాయం ఉన్నవారు 28 శాతం ఉన్నారు. 50 వేల కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వారి సంఖ్య కేవలం 4 శాతం ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

