న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలు ఏటీఎంలలో నగదు నిండుకుంటున్నది. నగదు లభ్యతలో భారీ కొరత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని ఏటీఎంల నిర్వాహకులు, నగదు రవాణా సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ద కాన్ఫిడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) వెల్లడించింది. ఏటీఎం నిర్వాహకులకు అవసరమైన నగదులో మార్చిలో 64 శాతం, ఏప్రిల్‌లో 57 మాత్రమే కేటాయించారని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు సమర్పించిన నివేదికలో సీఏటీఎంఐ తెలియజేసింది.
అయితే ఆర్బీఐ వెల్లడించిన వివరాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. దేశంలో ఈ ఏడాది మే 22 నాటికి రికార్డు స్థాయిలో నగదు చలామణి రూ. 42.54 లక్షల కోట్లు జరిగినట్టు ఆర్బీఐ తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో నగదు చలామణి ఒక పక్క పెరుగుతుండగా, అదే సమయంలో పలు ఏటీఎంలలో నగదు కొరత కన్పిస్తున్నది.