ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేతోపాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌పై అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోషల్ మీడియా సెల్‌కు చెందిన జితేన్ గజారియాపై పూణేలో కేసు నమోదైంది. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పూణే పోలీసులు ముంబైకు బయలుదేరారు. జనవరి 4న గజారియా ‘మరాఠీ రబ్రీ దేవి’ అనే క్యాప్షన్‌తో రష్మీ ఠాక్రే ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ఆ ట్వీట్‌ను ఆయన తొలగించారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే భార్యతోపాటు, శరద్ పవార్‌పై గజారియా చేసిన అభ్యంతరకరమైన పోస్టులపై శివసేన, ఎన్సీపీ నేతలు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.