న్యూఢిల్లీ: అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో యోగా చేసినందుకు లైఫ్ైస్టెల్ ఇన్ఫ్లుయెన్సర్ అర్చన మక్వానాపై కేసు నమోదైంది. ఆమె మతపరమైన విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా కించపరచినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. దేశంలోని గురుద్వారాలను నిర్వహించే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ ఫిర్యాదు మేరకు ఈ కేసును పంజాబ్ పోలీసులు నమోదు చేశారు. తనపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న అర్చన సామాజిక మాధ్యమాల నుంచి సంబంధిత ఫొటోలు, వీడియోలను తొలగించి, సిక్కులను క్షమాపణ కోరారు.