Baba Ramdev : యోగా గురు బాబా రామ్‌దేవ్ అసభ్యకర పోస్టర్లను సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఉత్తరాఖండ్‌లో దుమారం రేగింది. దాంతో పథంజలి యోగ్‌పీఠ్ లీగల్ సెల్ కంఖాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో డెహ్రడూన్‌కు చెందిన ఇద్దరు కార్టునిస్టులపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వాళ్ల కోసం గాలింపు చేపట్టారు. డెహ్రడూన్‌కు చెందిన గజేంద్ర రావత్, హేమంత్ మాల్వియా అనే ఇద్దరూ అసభ్యకర పోస్టర్లు రూపొందించారు. వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా బాబా రామ్‌దేవ్ ప్రతిష్టతను దెబ్బతీయాలని చూస్తున్నారని యోగ్‌పీఠ్ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది అని కంఖాల్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి ముకేశ్ చౌహన్ వెల్లడించారు.
ఇద్దరు కార్టూనిస్టులపై మతపరమైన విశ్వాసాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారనే నేరం నమోదు చేసి, ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు బుక్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ మధ్యే ఒక సభలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్‌దేవ్ బాబా వార్తల్లో నిలిచారు. మహిళలు దుస్తులు లేకున్నా అందంగానే ఉంటారని ఆయన నోరు జారారు. దాంతో, ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.