Caracal : కారాకాల్ (Caracal)..! ఇది అరుదైన అడవిపిల్లి (Wild cat)..! మన దేశం మొత్తంలో ఈ కారాకాల్ జాతి అడవి పిల్లుల జనాభా కేవలం 50 మాత్రమే ఉంది. అంతటి అరుదైన జాతి పిల్లి తాజాగా రాజస్థాన్ (Rajasthan) లోని ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ (Mukundra Hills Tiger Reserve) లో ప్రత్యక్షమైంది. ఇది వన్యప్రాణి ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపింది. టైగర్ రిజర్వ్‌లో సర్వే కోసం ఏర్పాటు చేసిన కెమెరాకు ఈ అరుదైన అడవి పిల్లి చిక్కింది.
రాజస్థాన్ అటవీశాఖ మంత్రి సంజయ్ శర్మ ఈ అరుదైన అడవిపిల్ల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ అరుదైన అడవి పిల్లి ప్రత్యక్షమవడం ‘వైబ్రాంబ్ హోలీ సర్ప్రైజ్’ అని మంత్రి అభివర్ణించారు. టైగర్ రిజర్వ్‌లోని వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. అరుదైన అడవిపిల్లి ఫొటోను ట్యాగ్ చేస్తూ మంత్రి పెట్టిన పోస్టును కింద చూడవచ్చు.
On this vibrant day of Holi, Rajasthan forest department is excited to share the first photographic record of Caracal in Mukundra hills Tiger Reserve.
The winter Phase IV survey of the tiger reserve recorded this camera trap image of Caracal. The strong protection regime of… pic.twitter.com/HqplxM5vCb
— Sanjay Sharma (@Sanjay4India1) March 14, 2025