నోయిడా: ఢిల్లీలోని నోయిడాలో పార్కింగ్(Parking Dispute) విషయంలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం అదుపు తప్పి.. భారీ గొడవకు దారి తీసింది. నోయిడా సెక్టార్ 72లో ఈ ఘర్షణ జరిగింది. ఓ గ్రూపునకు చెందిన వ్యక్తులు.. రోడ్డుపై ఉన్న వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. దాంట్లో ఇద్దరు మహిళలు, ఓ మైనర్ ఉన్నారు. సెక్టార్ 72లోని బీ బ్లాక్లో ఘటన జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఓ ఎరుపు రంగు కారును బ్యాట్లతో ధ్వంసం చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సెక్టార్ 113 పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.
Kalesh b/w Two parties over car parking in Sector 72’s B Block in Noida’s Sector 113 police station area, there was a lot of ruckus on the road, the car was broken with a cricket bat, Noida UP
pic.twitter.com/ysMagNpWuW— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024