బెంగళూరు: పొరుగింటి వ్యక్తిని హత్య చేసేందుకు ఒక వృద్ధుడు ప్రయత్నించాడు. బైక్‌పై వెళ్తున్న అతడ్ని కారుతో వేగంగా ఢీకొట్టాడు. (Car driver rams neighbour’s bike) ఆ సమయంలో నడుస్తూ వెళ్తున్న మహిళ గాల్లోకి ఎగిరింది. ప్రహరి గోడకున్న ఇనుప చువ్వలోకి ఆమె కాలు దిగడంతో తలకిందులుగా వేలాడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. బెజై ప్రాంతంలో నివసించే 69 ఏళ్ల సతీష్ కుమార్ బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. పొరుగున నివసించే మురళీ ప్రసాద్ కుటుంబంతో చాలా కాలంగా వివాదం ఉన్నది. ఆ కుటుంబంతో ఎప్పుడూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో మురళీ కృష్ణను కారుతో ఢీకొట్టి హత్య చేయాలని ప్లాన్ వేశాడు.
కాగా, మార్చి 13న ఉదయం 8.15 గంటల సమయంలో మురళీ ప్రసాద్ బైక్‌పై వెళ్తున్నాడు. ఇరుకైన వీధిలో కారులో వేచి ఉన్న సతీష్ కుమార్ వేగంగా అతడిపైకి వాహనంతో దూసుకెళ్లాడు. బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. అయితే ఆ సమయంలో అక్కడ నడుస్తూ వెళ్తున్న మహిళ ఈ ప్రమాదం ధాటికి గాల్లోకి ఎగిరింది. ఒక ఇంటి ప్రహరీ గోడకున్న ఇనుప కంచెకు ఆమె కాలు చిక్కుకున్నది. దీంతో తలకిందులుగా వేలాడింది. గమనించిన స్థానికులు ఆ మహిళను కాపాడారు. రక్తం కారుతున్న కాలుకు కట్టుకట్టి ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మురళీ ప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్లో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సతీష్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. కస్టడీ నిమిత్తం జైలుకు తరలించారు.
కాగా, కారును నిర్లక్ష్యంగా నడిపి మహిళను గాయపర్చినందుకు మంగళూరు ట్రాఫిక్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో సతీష్ కుమార్‌పై మరో కేసు నమోదైంది. 2023లో బైక్ నడుపుతున్న మురళీ ప్రసాద్ తండ్రిని అతడు ఢీకొట్టాడని, ఉర్వా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు బైక్‌పైకి కారు దూసుకెళ్లడం, మహిళ గాల్లోకి ఎగిరిన సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A retired #BSNL employee in #Karnataka’s #Mangaluru has been arrested for allegedly attempting to murder his neighbour by intentionally ramming his car into the latter’s motorcycle amid a longstanding dispute.
The accused, 69-year-old #SatishKumarKM, a resident of #Bejai, was… pic.twitter.com/ssdpJxwEvF
— Hate Detector 🔍 (@HateDetectors) March 14, 2025