CM Omar Abdullah | న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ తరచూ విమర్శలు చేయడాన్ని ఇండియా కూటమి నేత, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ఓటింగ్ పద్ధతిని ప్రశ్నించడంలో స్థిరంగా ఒక విధానానికి కట్టుబడి ఉండాలని, గెలిచినప్పుడు సంబరాలు చేసుకుని, ఓడినప్పుడు విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘పార్లమెంట్ ఎన్నికల్లో అవే ఈవీఎంల ద్వారా 100 సీట్లను తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వెంటనే ఈవీఎంలు నచ్చలేదు. వాటిని తప్పుబడుతున్నారు. ఇదేం విధానం. ఎంతమాత్రం సరికాదు’ అని కాంగ్రెస్ తీరును విమర్శించారు.