చెన్నై: ఇస్లాం మతంలోకి మారినవారు రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం వెనుకబడిన తరగతి ముస్లిం(బీసీ ముస్లిం) హోదాను పొందలేరని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం 2024లో జారీ చేసిన జీవోను న్యాయస్థానం కొట్టివేసింది. హిందూ మతంలోని వెనుకబడిన తరగతులవారు ఇస్లాంలోకి మారిన తర్వాత కూడా వారిని వెనుకబడిన తరగతి మస్లింలుగా పరిగణించేందుకు అనుమతినిస్తూ, తమిళనాడు ప్రభుత్వం జారీచేసిన ‘జీవో నంబర్ 15’ను రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం తీర్పు చెప్పింది.
‘పరమశివం అనే హిందూ మతానికి చెందిన వ్యక్తి 2015లో ఇస్లాంలో మారగా, ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిగా సర్టిఫికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని తహసీల్దార్ తిరస్కరించడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు.