పాట్నా: ఒక అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్నది. గేట్లు మూసి ఉండటంతో తెలివిగా వ్యవహరించింది. మూసిన గేటు కింద నుంచి దూరి లోనికి వెళ్లింది. (Candidate Reaches Late To Exam Centre) వెంట వచ్చిన బంధువులు ఆమెకు సహకరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని నవాడా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పరీక్ష రాసేందుకు ఒక యువతి ఆలస్యంగా పరీక్షా కేంద్రం వద్దకు చేరింది. అయితే అప్పటికే బయటి గేట్లు మూసేశారు.
కాగా, ఆ యువతి తెలివిగా వ్యవహరించింది. ఆలస్యం చేయకుండా గేటుకు, నేలకు మధ్య ఉన్న చిన్న గ్యాప్ నుంచి దూరి లోనికి వెళ్లింది. వెంట వచ్చిన బంధువులు ఆమెకు సహకరించారు. గేటు కింద నుంచి లోపలకు ఆ యువతిని తోశారు. పరీక్షా కేంద్రం బయట ఉన్న పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఇది చూసేందుకు ముందుకు వచ్చిన జనాన్ని దూరంగా తరిమారు. అయితే గేటు కింద నుంచి దూరి పరీక్షా కేంద్రం లోనికి వెళ్లిన ఆ అభ్యర్థిని పరీక్ష రాయడానికి అనుమతించారా లేదా అనేది తెలియలేదు.
మరోవైపు అక్కడున్న కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ‘బీహారీలు అంతే. వారు ఏడుస్తూ, సిబ్బంది గేటు తెరిచే వరకు వేచి ఉండరు. దీనికి బదులు తెలివిగా వ్యవహరిస్తారు’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘బాగా చదువుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించే వారిని ఎవరూ వెనక్కి లాగలేరు. కష్టపడి పనిచేసి పురోగతి సాధించేవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. లాఫింగ్ ఎమోజీలతో మరికొందరు స్పందించారు.
नवादा: परीक्षा केंद्र पर देर से पहुँचने के कारण छात्रों को अंदर प्रवेश नहीं मिल सका, जिसके बाद सभी ने प्रवेश के लिए प्रयास जारी रखा…🤣🤣#BreakingNews #News #Nawada #NawadaBihar pic.twitter.com/HWs2K6jHMT
— ᏙᏦ🇮🇳 (@_VK86) February 2, 2025