న్యూఢిల్లీ: అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఉండే ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. తాజా అధ్యయన నివేదిక సహ రచయిత డాక్టర్ తిమోతీ యీట్మన్ మాట్లాడుతూ, పెద్ద పేగు, గొంతు, నోరు మార్గంలో ప్రతి రోజూ సెల్ డీఎన్ఏ సీక్వెన్స్‌లో మార్పులు (మ్యుటేషన్స్) జరుగుతాయన్నారు.
ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాల నుంచి వెలువడే అణువుల సహాయంతో శరీరంలోని రోగ నిరోధక శక్తి ఈ మార్పుల ప్రభావాన్ని నివారిస్తుందన్నారు. సన్‌ఫ్లవర్, కార్న్, పీనట్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌లో ఇది ఉంటుంది.