క్యాన్సర్‌కు దివ్యౌషధం!
- మలాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టిన ‘డోస్టర్లిమాబ్’
- వైద్యచరిత్రలో తొలిసారి అన్న వైద్యులు
నేషనల్ డెస్క్: వైద్య చరిత్రలో అద్భుతం చోటుచేసుకొన్నది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకున్నప్పటికీ, పూర్తిస్థాయిలో నయంకాని క్యాన్సర్ మహమ్మారి.. ఓ ఔషధంతో సమూలంగా మాయమైపోయింది. యావత్తు ప్రపంచ దేశాలూ ఆనందాశ్చర్యాలకు కారణమైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకున్నది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది.
ట్రయల్ ఎలా జరిగింది?
మలాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 మంది రోగులకు వైద్యులు ‘డోస్టర్లిమాబ్’ అనే ఔషధాన్ని ఇచ్చారు. కోర్సు పూర్తయిన తర్వాత రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్‌ను తీయించారు. పురీషనాళంలో ఉన్న క్యాన్సర్ గడ్డ ఆశ్చర్యకరంగా మాయమైంది. ఇతర అవయవాల్లో కూడా క్యాన్సర్ కణాలు కనిపించలేదు. ఫలితాలను ఇతర వైద్యులు కూడా పరీక్షించి ధ్రువీకరించారు. పెద్దమొత్తంలో ట్రయల్స్ నిర్వహణకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏమిటీ దివ్యౌషధం?
ట్రయల్‌లో వినియోగించిన డ్రగ్ పేరు ‘డోస్టర్లిమాబ్’. గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో భాగంగా దీన్ని కూడా వినియోగిస్తారు. తాజా ట్రయల్‌లో.. రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుంటూ తిరుగుతున్న క్యాన్సర్ కణాలను వెలుగులోకి తీసుకొచ్చి, నాశనం చేయడంలో ఈ డ్రగ్ కీలక పాత్ర పోషించినట్టు వైద్యులు తెలిపారు.
ఔషధం ఖరీదు ఎంత?
‘డోస్టర్లిమాబ్’ను మూడు వారాల ఎడంతో ఆరు మాసాల పాటు (దాదాపుగా ఎనిమిది డోసులు) ఇచ్చారు. ఒక్కో డోసు ఖరీదు రూ. 8.55 లక్షలు. అయితే, డోసు ఎంత మోతాదులో ఇచ్చారన్న విషయాన్ని పరిశోధకులు వెల్లడించలేదు.
ట్రయల్‌లో పాల్గొన్న ప్రతీ రోగికి క్యాన్సర్ నయమవ్వడం ఇప్పటివరకూ వినలేదు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. ట్రయల్‌లో పాల్గొన్న ఏ ఒక్కరిపై దుష్ప్రభావాలు కనిపించకపోవడం మరో విశేషం.
– డాక్టర్ ఆలన్పీ వెనూక్, పెద్దప్రేగు క్యాన్సర్ నిపుణుడు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
వైద్యశాస్త్రంలో ఇదో మహాద్భుతం. తాము క్యాన్సర్ నుంచి విముక్తిపొందామని తెలియడంతో రోగులందరూ తమ ఉద్వేగాన్ని ఆపుకోలేక చిన్నపిల్లల్లా ఏడ్చారు.
– డాక్టర్ ఆండ్రియా సెర్కెక్, ట్రయల్ సహ అధ్యయనకారిణి, మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్-న్యూయార్క్
గతంలోఎన్నో కఠిన పరిస్థితులు
ట్రయల్‌లో పాల్గొనడానికి ముందు క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ, రేడియేషన్, ఇన్వేసివ్ సర్జరీ వంటి ట్రీట్మెంట్లను తీసుకున్నట్టు రోగులు తెలిపారు. ఈ చికిత్సలు జరిగేప్పుడు ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్టు గుర్తు చేసుకున్నారు. అయితే, ‘డోస్టర్లిమాబ్’ డ్రగ్‌తో క్యాన్సర్ సంపూర్ణంగా మాయమవ్వడం నిజంగా ఆనందాన్నిస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Cancer
- Dosterlimab
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

