యాజమానిని చంపిన ఒంటె.. ఆగ్రహంతో దానిని కొట్టి చంపిన జనం
యజమాని నాయక్‌ను ఆ ఒంటె తొలుత కాళ్లతో తన్నింది. కింద పడిన అతడి మెడ, తలను నోటితో పట్టుకుని గట్టిగా కొరికింది. దీంతో యజమాని నాయక్ అక్కడికక్కడే మరణించాడు.
జైపూర్: ఒక ఒంటె తన యజమానిని చంపింది. దీంతో ఆగ్రహించిన జనం ఆ ఒంటెను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దీంతో ఆ ఒంటె చనిపోయింది. రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంచు గ్రామానికి చెందిన సోహన్‌రామ్ నాయక్‌కు ఒక ఒంటె ఉన్నది. సోమవారం సాయంత్రం మరో ఒంటెను చూసిన అది తాడు తెంపుకుని పరుగెత్తింది. గమనించిన నాయక్ దాని వెంటపడి పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ఆ ఒంటె, యజమాని నాయక్‌ను తొలుత కాళ్లతో తన్నింది. కింద పడిన అతడి మెడ, తలను నోటితో పట్టుకుని గట్టిగా కొరికింది. దీంతో యజమాని నాయక్ అక్కడికక్కడే మరణించాడు.
కాగా, నాయక్ కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు దీనిని చూసి షాకయ్యారు. అతికష్టం మీద ఆ ఒంటెను అదుపు చేశారు. అనంతరం దానిని ఒక చెట్టుకు కట్టేశారు. యాజమాని నాయక్‌ను చంపిందన్న ఆగ్రహంతో అతడి కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి కర్రలతో ఆ ఒంటె తలపై పలుమార్లు కొట్టారు. దీంతో దెబ్బలు తాళలేక అది చనిపోయింది. అయితే ఆ ఒంటెకు పిచ్చి పట్టిందని, మానవులకు హానికరంగా మారిందని దానిని చంపిన జనం తమ చర్యను సమర్థించుకున్నారు. మరోవైపు ఒంటెను చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

