మంగళవారం 14 జూలై 2020
National - Jun 23, 2020 , 14:12:35

నేపాల్‌ సరిహద్దులో వరద నివారణ పనులపై సీఎం ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపు

నేపాల్‌ సరిహద్దులో వరద నివారణ పనులపై సీఎం ఉన్నతస్థాయి సమావేశానికి పిలుపు

పాట్నా : బిహార్‌ నీటి వనరుల విభాగం అధికారులతో సీఎం నితిష్‌కుమార్‌ మంగళవారం ఉన్నతస్థాయి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.  బీహార్‌లోని భారత్‌, నేపాల్‌ సరిహద్దులో నదీ కట్టల మరమ్మతలు పనులను నిలిపివేయడంపై ఈ సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చినట్లు తెలిసింది.  నేపాల్‌లో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశం ఉండనున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బిహార్‌ నీటి వనరుల శాఖ మంత్రి సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ వరద గురించి ఇప్పుడే నేను ముఖ్యమంత్రితో సమావేశానికి వెళ్తున్నాను.  మీటింగ్‌ పూర్తయ్యాక నేను పూర్తి వివరాలను తెలుసుకొని తదుపరి కార్యాచరణను మొదలు పెడతామన్నారు.


logo