రాంచీ: ఒక దూడ పరుగున శ్మశానవాటికకు చేరుకుంది. మరణించిన యజమాని మృతదేహం వద్దకు వెళ్లి కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది. ఈ హృదయవిదారక సంఘటన జార్ఖండ్లో జరిగింది. హజారీబాగ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల చనిపోయాడు. దీంతో బంధువులు, స్నేహితులు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధమయ్యారు.
ఇంతలో చనిపోయిన వ్యక్తికి చెందిన పశువుల్లోని ఒక దూడ పరుగున శ్మశానవాటికకు వచ్చింది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే యజమాని కోసం వెతికింది. అక్కడున్న వారు పక్కకు జరుగడంతో చివరకు అతడి మృతదేహం వద్దకు చేరుకుంది. యజమాని ముఖాన్ని నాకి కన్నీరు కార్చింది. అంతేగాక అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నది. ఇది చూసి మృతుడి బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. కాగా, ఒక యూజర్ ట్విట్టర్లో గురువారం పోస్ట్ చేసిన ఈ హృదయవిదారక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
झारखंड के हजारीबाग में मालिक की मौत पर श्मशान पहुंचा पालतू बछड़ा; चेहरा देखने के लिए मुंह से हटाता रहा कफन, गांववालों ने बछड़े से करवाया अंतिम संस्कार#Jharkhand #BreakingNews pic.twitter.com/zYLZPGJSjI
— shakti ojha🇮🇳 (@imShaktiojha) September 15, 2022