కోల్కతా: పశ్చిమబెంగాల్ టీచర్ల నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం సంచలన తీర్పు చెప్పింది.
2014లో నియమితులైన సుమారు 30,000 మంది ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి బెంచ్ గతంలో ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. వ్యవస్థాగతంగా కొంత చెడు జరిగినా, మొత్తం వ్యవస్థను దెబ్బతీయడానికి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేసింది.