కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరుకుంది. పార్టీ బహిష్కరించిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని విపక్ష నేత (ఎల్వోపీ)గా స్పీకర్ ఎలా నియమిస్తారని కలకత్తా హైకోర్టు ప్రశ్నించింది.
బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం రితబ్రత బెనర్జీకి పార్టీ ఆమోదం లేదని పేర్కొన్నది. విపక్ష నేతగా రితబ్రతను నియమిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మధ్యంతర స్టే విధించాలని బెనర్జీ కోరారు. తదుపరి విచారణను 16కు కోర్టు వాయిదా వేసింది.