న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో కేబుల్ కట్స్ వల్ల భారత్, పాక్, యూఏఈ సహా ఆసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది. ఈ కేబుల్ కట్స్‌కు కారణాలేమిటో వెల్లడి కాలేదు. సౌదీ అరేబియాలోని జెడ్డా సమీపంలో ఉన్న ఎస్ఎండబ్ల్యూ4, ఐఎంఈడబ్ల్యూఈ కేబుల్ సిస్టమ్స్ విఫలమైనట్లు మానిటరింగ్ గ్రూప్ నెట్‌బ్లాక్స్ తెలిపింది.
అనేక దేశాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీకి విఘాతం కలిగినట్లు పేర్కొంది. అజ్యూర్ క్లౌడ్ సర్వీస్‌కు కూడా అంతరాయాలు ఏర్పడినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ గుండా వెళ్లే మార్గాల్లోని యూజర్లపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది.